మంచువిష్ణు పనులకు అడ్డుగా ఉండొద్దనే.. అందరం రాజీనామా చేశాం

Prakash Raj Comments About His Panel Mass Resign To MAA
Prakash Raj Comments About His Panel Mass Resign To MAA
Prakash Raj Comments About His Panel Mass Resign To MAA
Prakash Raj Comments About His Panel Mass Resign To MAA

మా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మా ఎన్నికల తర్వాత తొలిసారి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్.. మా అసోసియేషన్ లో మంచు విష్ణు పనులకు అడ్డుగా ఉండకూడదనే అందరం కలిసి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. మీకు కావాల్సిన వాళ్ల‌ను పెట్టుకుని ఉచితంగా మా తరపున సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని మంచు విష్ణు టీంకు ప్ర‌కాశ్‌రాజ్‌ సూచించారు. విష్ణు రెండేళ్లు బాగా ప‌నిచేయాల‌ని ఆకాంక్షిస్తున్నట్టు ప్రకాష్ రాజ్ అన్నారు.

రౌడీయిజం ఎక్కువైంది..
‘మా’ మంచి కోసం అందరం కలిసి ముందుకొచ్చాం. ఈ సారి ఎన్నికల్లో రౌడీయిజం పెరిగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ల దగ్గర మొదలైన రౌడీయిజం మీద చేయి చేసుకునేంత వరకు వెళ్లింది. బయటి నుంచి మనుషుల్ని తీసుకొచ్చారు. బెనర్జీ మీద చెయ్యి చేసుకుని అసభ్యంగా ప్రవర్తించారు. గెలిచిన వాళ్లను ఓడిపోయారని.. ఓడిపోయిన వారిని గెలిచారని ప్రకటించారు. అంతా గందరగోళంగా ఉంది. ఇలాంటి వాతావరణంలో కలిసి పనిచేయడం చాలా కష్టం. గతంలోనే సగం సగం ప్యానెల్ తో కలిసి పనిచేయలేకపోయారు. ఈ సారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి పని చేయగలమా? అందుకే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుండాలని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

Prakash Raj New MAA Association ( ATMAA)
Prakash Raj New MAA Association ( ATMAA)

అలా అయితే రాజీనామా వెన‌క్కి తీసుకుంటా..
నా రాజీనామాను అంగీకరించను అని మంచు విష్ణు అన్నారు. సరే.. ఒప్పుకుంటా తెలుగు వాళ్లు కాక‌పోయినా బైలాస్ మార్చ‌ననే ష‌ర‌తుకు ఓకే చెప్తే నా రాజీనామా వెన‌క్కి తీసుకుంటాన‌ని ప్ర‌కాశ్‌రాజ్ ప్రకటించారు. ఓటేసేందుకు, ఒక‌రిని స‌భ్యుడిగా గెలిపించేందుకు నేను స‌భ్యుడిగా ఉండ‌నని ప్ర‌కాశ్‌రాజ్‌ స్ప‌ష్టం చేశారు. ఇది ఎమోష‌న‌ల్ గా తీసుకున్న నిర్ణ‌యం కాద‌న్నారు. మీరు ప‌నిచేయాలి. ఎలా పనిచేస్తున్నారో బయటి నుంచి చూస్తాం. మా రాజీనామాలను మా అధ్యక్షుడు మంచు విష్ణు ఒప్పుకుంటాడని ఆశిస్తున్నాం అన్నారు ప్రకాష్ రాజ్.