మా ఎన్నికల్లో వైసీపీ జోక్యం చేసుకుంది.. ఆధారాలు బయటపెట్టిన ప్రకాష్ రాజ్

Prakash Raj Complaints To Elections Officer About MAA Elections
Prakash Raj Complaints To Elections Officer About MAA Elections
Prakash Raj Complaints To Elections Officer About MAA Elections
Prakash Raj Complaints To Elections Officer About MAA Elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయి.. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై రెండు వారాలు గడుస్తున్నా.. సినీ ఇండస్ట్రీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జోక్యం చేసుకుందంటూ ప్రకాష్ రాజ్ బహిరంగ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన మా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

Prakash Raj Complaints To Elections Officer About MAA Elections
Prakash Raj Complaints To Elections Officer About MAA Elections

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ మోహన్ కి సీసీటీవీ ఫుటేజీ చూసిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికల హాల్లోకి వైసీపీ నాయకుడు నూకల సాంబశివరావును ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. సాంబశివరావు ఎన్నికల హాల్లో ఓటర్లను బెదిరింపులకు గురి చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

మా ఎన్నికల్లో అవకతవకల విషయంలో ప్రకాష్ రాజ్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంచు విష్ణుతో సాంబశివరావు కలిసి దిగిన ఫొటోలను ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కి పంపడమే కాకుండా.. ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు.

జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ లీడర్ సాంబశివరావు మీద పలు క్రిమినల్ కేసులున్నాయని ఆరోపించారు. కృష్ణమోహన్ గారూ… ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీటీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికలు ఎలా జరిగాయో.. పోలింగ్ బూత్ లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి అంటూ ట్వీట్ లో రాశారు ప్రకాష్ రాజ్.