హిందీ మాట్లాడే వ్యక్తి అని.. చెంప పగలకొడతాడా.. ప్రకాష్ రాజ్ పై పిచ్చి విమర్శలు..!

Prakash Raj Controversy Scene From Jai Bheem Movie Going Viral In Social media
Prakash Raj Controversy Scene From Jai Bheem Movie Going Viral In Social media
Prakash Raj Controversy Scene From Jai Bheem Movie Going Viral In Social media
Prakash Raj Controversy Scene From Jai Bheem Movie Going Viral In Social media

సూర్య హీరోగా నటించిన జై భీమ్ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినీ రాజకీయ సెలబ్రెటీలందరు ఈ చిత్రం తప్పక చూడండి అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య నటనకి, కంటెంట్ కి విమర్శకుల నుండే కాక ఆడియన్స్ నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అప్పట్లో మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద ప్రజలని ఎలా టార్గెట్ చేసి హింసించేవారనేది ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడంటూ దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశసంల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ కొట్టిన ఒక చెంపదెబ్బ సీన్ సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతుంది.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ జై బీమ్ చిత్రంలో హిందీ మాట్లాడే ఒక వ్యక్తిని చెంపమీద కొడతాడు.     ఒక విచారణలో భాగంగా ప్రకాష్ రాజ్ ఇలా కొట్టడాన్ని.. హిందీ భాషనీ అవమానించినట్టే అని సోషల్ మీడియాలో నార్త్ నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ ఉదంతంపై ప్రకాష్ రాజ్ స్పదించాడు. ‘ అణగారిన కులాల వారి పట్ల కొందరు అత్యంత హేయంగా ప్రవర్తించిన అంశాలని ఈ సినిమాలో అద్భుతంగా చూపెడితే.. దాన్ని ప్రశంసించాల్సింది పోయి.. కొంతమంది అసలు విషయాన్ని మరిచి.. చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు’అని ప్రకాశ్ రాజ్ ట్విట్‌ చేశాడు. అయితే నేనంటే పడనీ వారు.. కేవలం నేను నటించనన్న కారణంతోనే ఈ అనవసర కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ చెప్పటం జరిగింది. బీజేపీ పార్టీ విధానాలని ఎప్పటికప్పుడు నిలువున ఖండించే ప్రకాష్ రాజ్ పై కావాలనే కొందరు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు నెటిజన్స్.