’మా‘లో భారీ కుదుపు.. ప్రకాశ్ రాజ్ కోర్టు కేసు.. మా ఎలెక్షన్స్ రద్దు కాబోతున్నాయా ? మంచు వర్గం కౌంటర్ ఏంటి ?

Actor Prakash Raj Court Case On MAA Elections
Actor Prakash Raj Court Case On MAA Elections

 

Actor Prakash Raj Court Case On MAA Elections
Actor Prakash Raj Court Case On MAA Elections

విమర్శలు, ప్రతివిమర్శలు.. తిట్లు, దూషణలు.. ఇలా ఎన్నో అంశాల నడుమ జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించినా.. వివాదాలు మాత్రం తగ్గకపోగా.. రెట్టింపు అవుతున్నాయి. విద్వేషాలు రెచ్చగొట్టి.. సభ్యులని బండబూతులు తిడుతూ, కొడుతూ.. అనేక అక్రమాల నడుమ ఎన్నికలు జరిగాయని విమర్శిస్తూ.. ఇప్పటికే మూకుమ్మడి రాజీనామాలు చేశారు ప్రకాశ్ రాజ్ ప్యానల్. దీనికి తోడు బ్యాలెట్ బాక్సులు ఇంటికి తీసుకెళ్లారని.. రాత్రికి రాత్రి ఫలితాలని తారుమారు చేశారని.. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు నిగ్గుతేల్చాలని తాజాగా ప్రకాశ్ రాజ్ కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడట.  దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారిని సీసీ కెమెరా పుటేజీ కావాలని ప్రకాశ్ రాజ్ కోరారు.
తమ సభ్యులపై జరిగిన దాడులు, అక్రమాలు వంటి పలు సాక్షాదారాలని సేకరించి న్యాయస్థానానికి అందజేయనున్నాడట ప్రకాష్ రాజ్. అయితే ప్రకాశ్ రాజ్ తీసుకున్న ఈ నిర్ణయం మంచు విష్ణు ప్యానల్ కి భారీ షాక్ అని చెప్పొచ్చు.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులని మోహన్ బాబు తీవ్రంగా దూషించాడు. ఈ విజువల్స్ మీడియాలో కూడా హల్చల్ చేశాయి. మోహన్ బాబు తమని పచ్చి బూతులు తిడుతూ కొట్టారని బెనర్జీ, తనీష్, ఉత్తేజ్ వంటివారు ఇప్పటికే మీడియా సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక అనసూయ వంటి వారి ఫలితాలైతే రాత్రికి రాత్రి తారుమారైపోయాయి. ఈ సాక్షాలని కనుక పర్ఫెక్ట్ గా సేకరించి కోర్టుకి సమర్పిస్తే.. మంచు విష్ణుకి న్యాయపరమైన కష్టాలు తప్పవంటున్నారు.  బ్యాలెట్ బాక్సులు ఎందుకు ఇంటికి తీసుకెళ్లారు.. రిజల్ట్ లో ఏదైనా అవకతవకలు జరిగాయా.. ఎన్నికల అధికారులని మోహన్ బాబు ఏమైనా ప్రభావితం చేశాడా తేల్చాలంటూ కోర్టు కానీ విచారణకి ఆదేశిస్తే.. రిపోర్ట్ వచ్చేవరకు ఎన్నికలని తాత్కాలికంగా రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు. ఇలాంటి సంఘటనలు తమిళనాడులో జరిగాయని ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజాలు నిగ్గుతేలేవరకు అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికను హోల్డ్ లో కూడా పెడతారని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రకాశ్ రాజ్ ఆరోపణలు కనుక నిజమని తేలితే.. ఎన్నికలు రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది.