‘మా’లో సంచలనం.. నిట్టనిలువున చీలిన ‘మా’.. ప్రకాశ్ రాజ్ టీమ్ మూకుమ్మడి రాజీనామాలు..!

prakash raj panel resign from MAA
prakash raj panel resign from MAA
prakash raj panel resign from MAA
prakash raj panel resign from MAA

మా ఎన్నికల రాజకీయాలు రోజుకొక ట్విస్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తుంది. మొన్నటివరకు ‘మా’ కింగ్ ఎవరన్నా చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. తీవ్ర ఉత్కంఠత నడుమ ఎన్నికలు జరిగాయి. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు సంచలన విజయం సాధించాడు. ఇక ఇక్కడితో గొడవలు సద్దుమణుగుతాయని. అందరు కలిసి పనిచేస్తారని బావించారంతా.. కానీ అలా జరుగుతే మా స్పెషలిటీ ఏముంటుంది. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులందరు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా తన ప్యానల్ సభ్యులతో ప్రకాష్ రాజ్ మీడియా సన్నివేశం రేపాటు చేసి మరి రాజినామాలకి ప్రకటించాడు. క్రితం సారి జరిగిన ఎన్నికల్లో గెలిచినా ఓడిన సభ్యులతో కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేస్తే నరేష్ ప్యానల్ సరిగ్గా పనిచేయలేకపోయింది. ఆ పరిణామాలే దృష్టిలో పెట్టుకొని మేము విష్ణు ప్యానల్ లో కొనసాగొద్దు అనుకుంటున్నామని.. ” సంస్థని శ్రీ విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము “మా” పదవులకు మనసా వాచా కర్మణా, రిజైన్ చేస్తున్నాం. అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిల ట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల భవిష్యత్తు లో “మా” లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం” అని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రకటించింది.