సొంతవాళ్లని కొట్టారు.. రౌడీల్లా ప్రవర్తించారు.. ఇక మీకు ఉంటుంది.. ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం..!

Prakash Raj Sensational Comments On Manchu Family Behavior In Maa elections

మా ఎన్నికల ఫలితాల తరువాత అందరు కలిసి పనిచేస్తారని బావించారంతా.. కానీ అలా జరుగుతే మా అసోసియేషన్ స్పెషలిటీ ఏముంటుంది. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులందరు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మా ఎన్నికల తర్వాత తొలిసారి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పెట్టిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మా’ మంచి కోసం అందరం కలిసి ముందుకొచ్చాం. ఈ సారి ఎన్నికల్లో రౌడీయిజం పెరిగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ల దగ్గర మొదలైన రౌడీయిజం మీద చేయి చేసుకునేంత వరకు వెళ్లింది. బయటి నుంచి మనుషుల్ని తీసుకొచ్చారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. రాత్రికి రాత్రే ఫలితాలు మార్చేశారు. బెనర్జీ మీద చెయ్యి చేసుకుని అసభ్యంగా ప్రవర్తించారు. తనీష్ ని బౌన్సర్లతో కొట్టించాలని చూశారు. గెలిచిన వాళ్లను ఓడిపోయారని.. ఓడిపోయిన వారిని గెలిచారని ప్రకటించారు. అంతా గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి పని చేయగలమా? అందుకే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుండాలని అందరం కలిసి ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాం.. ఇక ప్రతినెలా రిపోర్ట్ కార్డు అడుగుతాం.. అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.