నరేష్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. అంత అహంకారం పనికి రాదు.. మాకు పడే ఓట్ల సునామీలో కొట్టుకుపోతారు

Prakash Raj Sensational Comments On Naresh
Prakash Raj Sensational Comments On Naresh
Prakash Raj Sensational Comments On Naresh
Prakash Raj Sensational Comments On Naresh

మా ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది సినీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు మెగా కాంపౌండ్ సపోర్ట్ తో ప్రకాష్ రెచ్చిపోతుంటే.. మరోవైపు మంచు విష్ణు కూడా గట్టి పోటీనే ఇస్తున్నాడు. కాగా తాజాగా మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ మీద మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సిగ్గు పడేలా నరేష్ ప్రవర్తిస్తున్నాడు. నరేష్ అంత అహంకారం పనికి రాదు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. అంటూ హెచ్చరించాడు ప్రకాష్ రాజ్. మా ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంచు విష్ణు ప్యానల్, నరేష్ ల మీద ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు. మా ఎన్నికల్లో సత్తా ఉన్నవాడే గెలుస్తాడని.. తనకి ఆ సత్తా ఉందని.. ఈసారి మా ఎన్నికల్లో గెలుపు తనదే అని ప్రకాష్ రాజ్ అన్నారు. మా ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకు అవసరం లేదని.. పెద్దలను సైతం ఎదురించి.. ప్రశ్నించగల సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదు అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు.

Prakash Raj Sensational Comments On Naresh
Prakash Raj Sensational Comments On Naresh

నేను మాట్లాడినంత స్వచ్ఛంగా తెలుగు భాషను మంచు విష్ణు ప్యానెల్ ఎవరూ మాట్లాడలేరు. నన్ను పెంచింది తెలుగు భాష.. మా అసోసియేషన్ కోసం, మూవీ ఆర్టిస్టుల కోసం బాధ్యతతో పనిచేయాలన్న ఉద్ధేశ్యంతో మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. మా సభ్యులందరికీ ఆత్మాభిమానం ఉంది. అసలు ఈ ఏడాది మేం ప్రశ్నించకపోతే ఇప్పటి వరకు కూడా మా ఎన్నిక ప్రస్తావనే ఉండేది కాదు.. అంటూ గొంతెత్తారు ప్రశాష్ రాజ్. మా ఎన్నికల గురించి బహిరంగంగా ప్రశ్నించినందుకు.. నన్ను బెదిరించారు. ఒక్క లెటర్ రాస్తే మా అసోసియేషన్ ఆపీసుకు తాళం పడేది. నేను కూడా రెండు రకాలుగా మాట్లాడగలను. సౌమ్యంగా మాట్లాడించి ఒప్పించగలను. మీలా.. కోపంగా కూడా మాట్లాడగలను. మా ఎన్నికలతో సంబంధమే లేని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, బీజేపీ పార్టీలను ఎందుకు లాగుతున్నారు? వైఎస్ జగన్ మీ చుట్టమైతే.. ఎన్నికలకు వస్తారా? రెండుసార్లు మంత్రి కేటీఆర్ మీకు హలో చెప్తే.. మీకు ఫ్రెండ్ అయిపోతారా? అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ఏ పోటీ అయినా మనం గెలవడానికి ప్రయత్నించాలి. అంతే గానీ.. అవతలి వాడిని ఓడించడానికి కాదు. చాలా బాధగా ఉంది. ఎన్నో సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనలతో పోటీకి దిగాం. న్యాయంగా ప్రచారం చేస్తాం.. ఎన్నికల్లో పాల్గొంటాం. మాకు పడే ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానెల్ కొట్టుకుపోతుంది అంటూ ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.