నా కూతురితో సంబంధం లేదు.. పిలిస్తే పెళ్ళికి వెళ్తా అంతే.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..!

Actor Prakash Raj Shocking Comments About His Daughter Marriage
Actor Prakash Raj Shocking Comments About His Daughter Marriage
Actor Prakash Raj Shocking Comments About His Daughter Marriage
Actor Prakash Raj Shocking Comments About His Daughter Marriage

ఇటీవల జరిగిన మా ఎన్నికల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన వ్యక్తి ప్రకాష్ రాజ్. స్క్రీన్ పై ఎలాంటి పాత్రనైనా చేయగలిగే ప్రకాష్ రాజ్ రియల్ లైఫ్ లో మాత్రం నటించడని అంటుంటారు. ప్రకాష్ రాజ్ ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు కూడా. అలాంటి ప్రకాష్ రాజ్ తాజాగా తన ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ విషయాలని చెప్పాడు. తన కూతురి విషయాలతో తనకి పెద్దగా సంబంధం ఉండదని.. తనకి నచ్చింది నచ్చినట్టు చేసే స్వేచ్ఛ ఉంటుందని చెప్పాడు. ప్రకాష్ రాజ్ 2009లో తన మొదటి భార్య నుంచి విడాకులు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ ని వివాహం చేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ అతడి మాజీ భార్యకు ముగ్గురు పిల్లలు సంతానం. ముగ్గురిలో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇక ప్రకాష్ రాజ్ తన కుటుంబం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పెద్ద కూతురు చదువు పూర్తి చేసుకుంది. తనకి సంగీతం అంటే ఇష్టం. తన ఫీల్డ్ లో సహాయం చేయమంటే చేస్తా. తన సినీ కెరీర్ విషయంలో హెల్ప్ చేస్తాను. తాను ఏమి అడిగినా చేస్తా. నేను నా భార్య దెగ్గర నుండే విడాకులు తీసుకున్నాను. పిల్లలకి తండ్రిగా ఎప్పటికి బాధ్యతగానే ఉంటాను. వారికి కావాల్సినవి ఇస్తాను. అంతే కానీ పెళ్లి విషయంలో ఆమెకు తండ్రిగా ఉండలేను. ఆమె పెళ్లి విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను. ఆమె ఎవరని పెళ్లి చేసుకున్నా అది తనిష్టం.పెళ్ళికి డబ్బు అడిగితే ఇస్తాను. పిలిస్తే వెళ్లి అక్షింతలు వేస్తాను. అంతకు మించి నాకు సంబంధం లేదు’ అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా అందుకు తన కుమార్తె కూడా ఒప్పుకుందని ప్రకాష్ రాజ్ తెలిపారు. చూస్తుంటే ఫ్యామిలీ విషయంలో ప్రకాష్ రాజ్ మరో రామ్ గోపాల్ వర్మ లా మాట్లాడుతున్నాడని నెటిజన్స్ కొందరు సెటైర్స్ వేస్తుంటే.. లేదు లేదు తన కూతురికి కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చి ఇండివిడ్యువాలిటీగా ఉండాలని కోరుకుంటున్నడని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.