మోహన్ బాబుకు షాకిచ్చిన ప్రకాష్ రాజ్.. లేఖలో ఏం రాశాడంటే.. ట్విస్టు అదిరింది

మా ఎన్నికల వివాదం ఇంకా సమసిపోలేదు. రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరుగగా.. ఎన్నికలు ముగిసి.. మంచు విష్ణు గెలిచిన తర్వాత మా తతంగంలో మరిన్ని మలుపులు తిరిగాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేశారు. తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాష్ రాజ్ లేఖాస్త్రం సంధించారు. మా ఎన్నికల పోలింగ్ సమయంలో అభ్యర్థులు, ఓటర్లతో మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.


ఆయన ప్రవర్తన తీరు విచక్షణారహితంగా ఉందని.. నరేష్ ప్రవర్తన కూడా సభ్యులను బాధపెట్టిందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. వారి ప్రవర్తన తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిందని.. ఆ దృశ్యాలు చూస్తే అసలు విషయం తెలుస్తుందని ఆయన అన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ డిలీట్ చేసే అవకాశం ఉందని.. వెంటనే వాటిని తమకు అందించాలని మా ఎన్నికల అధికారిని ప్రకాష్ రాజ్ కోరారు. సాధ్యమైనంత త్వరగా సీసీ ఫుటేజి కాపీలను ఇవ్వాలని ప్రకాష్ రాజ్ కోరారు. పోలింగ్ రోజు మోహన్ బాబు, నరేష్ బెదిరించిన వీడియోలు ఉన్నాయని లేఖలో ప్రకాష్ రాజ్ తెలిపారు. కాగా.. ఆయన లేఖకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. పోలింగ్ నాటి సీసీ ఫుటేజీలు భద్రంగా ఉన్నాయని.. నిబంధనలు ప్రకారం ఫుటేజీని ప్రకాష్ రాజ్ కు అందిస్తామని ఆయన తెలిపారు.