మోడీ క్షమాపణలపై.. ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..!

Prakash Raj Strong Counter To Narendra Modi Reaction On Farmers
Prakash Raj Strong Counter To Narendra Modi Reaction On Farmers

రైతులపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. సినీ ప్రముఖులు నాని, రామ్, రానా, సమంతలు కేసీఆర్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మంచిదని సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అన్నదాతల కుటుంబాలకు ఈ సాయం ఉపయోగపడుతుందని అన్నారు. స్వతహాగా రైతు అయిన కేసీఆర్, ఉద్యమకారుడు కూడా. అందుకే దేశంలో మరే ఇతర పార్టీ కూడా చెయ్యనటువంటి గొప్పపనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి 3లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచి మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు కేసీఆర్. దీంతో మన సీఎం కేసీఆర్ పై దేశం నలువైపులా నుండి ప్రశంసల వర్షం కురుస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ప్రకాశ్‌ రాజ్‌.. కేసీఆర్‌ నిర్ణయంపై పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ప్రియమైన ప్రధాని మోదీ గారూ.. క్షమాపణలు ఒక్కటే సరిపోవు. ఆ రైతుల కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా?’’ అని ప్రశ్నించారు. ‘‘సాగు చట్టాల వల్ల కలిగే ఇబ్బందులను పక్కనపెడితే.. అన్నదాతల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులపై ఆయనకున్న ప్రేమ తెలియజేస్తోంది’’ అంటూ రామ్‌ ట్వీట్‌ చేశారు. ఇక రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతించిన సీఎం కేసీఆర్.. అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలని.. 750 మంది రైతు కుటుంబాలకు కేంద్రం వెంటనే 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.