ఖైదీ నంబర్ 241383…జైల్లో సిద్దూ

మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిద్ధూను అధికారులు జైలుకు తరలించారు. ఆయనకు  241383 నంబర్ ఇచ్చారు. బ్యార‌క్ నెంబ‌ర్ 7 ను కేటాయించారు. జైల్లో సిద్ధూకు ఓ టెబుల్‌, రెండు ట‌ర్బ‌న్లు, ఓ క‌ప్‌బోర్డు, బ్లాంకెట్‌, రెండు ట‌వ‌ల్స్, దోమ తెర‌, ఓ పెన్ను, నోట్‌బుక్‌, షూలు, రెండు బెడ్‌షీట్స్ ఇచ్చారు. 1988 నాటి ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఏడాది పాటు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.