ఇన్ స్టా లో పేరు తీసేసిన సరే వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. డైవర్స్ రూమర్స్ కు చెక్

ఇన్ స్టా గ్రామ్ లో సమంత తన భర్త పేరు తీసేసిన నాటి నుంచి నాగచైతన్య-సమంత మధ్య విబేధాలు ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఇన్ డైరెక్ట్ గా తమ మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని సమంత అప్పుడే క్లారిటీ ఇచ్చారు. అలా ఇన్ స్టా లో తన పేరు చివర భర్త పేరు తీసేసిన కొన్ని రోజులకే ఈ జంట విడిపోయింది. అచ్చం అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా రెండు రోజుల కిందటే తన ఇన్ స్టా లో పేరు చివర భర్త పేరును తొలగించింది. దీంతో ఇక ప్రియాంక ఆమె భర్త నిక్ జొనాస్ కూడా విడిపోనున్నారని నిన్న పుకార్లు షికార్లు చేశాయి. మీడియాలో, సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఐతే మొత్తం వ్యవహారంపై ప్రచారం ఎక్కువ కావటంతో ప్రియాంక తల్లి క్లారిటీ ఇచ్చారు. వాళ్లిద్దరూ విడిపోవటం లేదని స్పష్టం చేశారు. కానీ చాలా మంది వీళ్లు విడిపోవటం ఖాయమంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తన భర్త తో ఓ టీవీ షో లో కనిపించి…తనకు ఫుల్ గా రోస్ట్ చేసి ఇద్దరి మధ్య ఉన్నది ఎంత గట్టి బంధమో వివరించింది.

నిక్ నువ్వంటే నాకు ప్రాణం

ఈ జంట విడిపోతుందని ప్రచారం జరుగుతున్నప్పటి ప్రియాంక మాత్రం ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ నిక్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పింది. నెట్ ప్లిక్స్ ఫ్లాట్ ఫామ్ వేదికగా ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ ఆధ్వర్యంలో జొనాస్ బ్రదర్ ఫ్యామిలీ రోస్ట్ అనే షో నిర్వహించారు. ఇందులో జొనాస్ బ్రదర్స్ తో పాటు వారి భార్యలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ తో పాటు నిక్ సోదరులను రోస్ట్ చేసింది. ఓ ఆట ఆడుకుంది. వారిపై పంచులు వేస్తూ అందరినీ నవ్వించింది. ఈ క్రమంలో నిక్ బ్రదర్స్ అందరికీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ కన్నా కూడా తనకే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటూ వారిని రెచ్చగొట్టేలా కామెంట్ చేసింది. మొత్తానికి షో లో నిక్ ప్రియాంక పుల్ హాపీగా కనిపించారు. ఈ సందర్భంగానే నిక్ అంటే తనకు చాలా ఇష్టమని ప్రియాంక తన మనసులో మాట బయటపెట్టారు. వాళ్లిద్దరీ మధ్య ఉన్న బంధం, ఇద్దరు ఒకరి అభిప్రాయాలను ఒకరు ఎలా గౌరవించుకుంటారనేది ఆమె వివరించారు.

మేమిద్దరం ఈ రోజు రాత్రి అంటూ

అటు షో లో భాగంగా ప్రియాంక అన్న ఓ మాటకు నిక్ ఒక్క క్షణం స్టన్ అయ్యారు. ఐతే ఆమె నోటి నుంచి వచ్చే మాట తను ఎక్స్ పెక్ట్ చేసినట్లు లేకపోవటంతో హమ్మయ్య అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతకీ ప్రియాంక ఏం అన్నదంటే.. ఇప్పటికీ మాకు పిల్లలు లేరు. కానీ ఈ రోజు రాత్రి మేమిద్దరం డ్రింక్ చేసి…అంటూ కాసేపు గ్యాప్ ఇచ్చింది దీంతో నిక్ ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. ఐతే ఇద్దరం ప్రశాంతంగా నిద్రపోవాలి అని ప్రియాంక అనటంతో అంతా ఫుల్ గా నవ్వుకున్నారు. మొత్తంగా ఈ జంట చేసిన సందడి చూసిన వారు ఈ జంట విడిపోదని గట్టిగా చెబుతున్నారు.