మహంకాళి అమ్మవారి దగ్గర తలకాయ కేసులో పురోగతి.. తుర్కయాంజల్ లో మొండెం?

Progress in the case of the head near Mahankali Ammavari temple

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ లో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి పైన ఇటుకలలో మనిషి మొండెం గుర్తించారు.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మెట్టు మహంకాళి అమ్మవారి దగ్గర వదిలి వెళ్ళిన తలకాయకి చెందిన మొండెంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

చింతపల్లి మండలంలో కలకలం రేపిన తలకాయకి చెందిన వ్యక్తి తుర్కయాంజల్ పరిసరాల్లోని ఒక ఆలయం బయట భిక్షాటన చేసేవాడని సమాచారం. ఇక్కడే బలి ఇచ్చి అక్కడకి తల తీసుకుని వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.