పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

telangana-govt-logo

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 బ్యాచ్‌కు చెందిన సర్ఫరాజ్‌ అహ్మద్‌, ప్రశాంతి, సత్యనారాయణ, హర్విందర్‌ సింగ్‌లకు సెలెక్షన్‌ గ్రేడ్‌ పదోన్నతి కల్పించారు.

శశాంక, శ్రుతి ఓజా, శివలింగయ్య, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్‌కుమార్‌, హైమావతి, హరితలకు జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ స్కేల్‌ పదోన్నతి లభించింది.

1997 బ్యాచ్‌కు చెందిన శైలజా రామయ్యర్‌, ఎన్‌.శ్రీధర్‌, అహ్మద్‌ నదీమ్‌, మీరబ్రహ్మయ్య ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి పొందారు.

తెలంగాణ లో 12 మంది ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్స్

1997 బ్యాచ్ కు చెందిన 4 ఐపీఎస్ లకు అడిషనల్ డీజీపీ గా ప్రమోషన్స్.

1)విజయ్ కుమార్

2)నాగిరెడ్డి

3)డీఎస్. చోహన్

4) సంజయ్ కుమార్ జైన్

2005 బ్యాచ్ కు చెందిన 5 ఐపీఎస్ లకు ఐజీ గా ప్రమోషన్స్

1)తరుణ్ జోషి

2)వి.శివ కుమార్

3)కమలసన్ రెడ్డి

4)చంద్రశేఖర్ రెడ్డి

5)ఏఆర్. శ్రీనివాస్

2008 బ్యాచ్ కు చెందిన తఫ్సర్ ఇక్బాల్ కు డీఐజీగా ప్రమోషన్, 2009 బ్యాచ్ కు చెందిన రేమ రాజేశ్వరి, అంబారి కిషోర్ ఝా లకు సెలెక్షన్స్ గ్రేడ్ ఆఫీసర్స్ కింద ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.