మరమ్మతుల ముసుగులో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

Interstate thieves gang arrested in Peddapalli district

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం గుట్టు రట్టు అయింది. చిక్కడపల్లి లోని సాయి కృప హోటల్ లో మరమ్మతుల ముసుగులో గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందడంతో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు హోటల్ పై దాడి చేశారు.

ఈ దాడిలో ఇద్దరు యువతులు, మేనేజర్ సహా  ముగ్గురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు యువతులు, హోటల్ సిబ్బందిని  కోర్టు రిమాండ్ చేసినట్టు పోలీసులు చెప్పారు.