అడ్డొచ్చిన వారి పై పిడిగుద్దులు.. సూపర్ మార్కెట్ లో రెచ్చిపోయిన స్పైడర్ మ్యాన్ - TNews Telugu

అడ్డొచ్చిన వారి పై పిడిగుద్దులు.. సూపర్ మార్కెట్ లో రెచ్చిపోయిన స్పైడర్ మ్యాన్స్పైడ‌ర్‌మ్యాన్ గెటప్ లో వచ్చిన ఓ వ్య‌క్తి సూప‌ర్ మార్కెట్‌లో నానా హంగామా సృష్టించాడు. అడ్డొచ్చిన సిబ్బంది పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. లండ‌న్‌లోని అస్ధ సూప‌ర్ మార్కెట్‌లో రెచ్చిపోయిన ఆ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పైడ‌ర్‌మ్యాన్ డ్రెస్‌లో వ‌చ్చిన ఈ వ్య‌క్తి అక్క‌డి మ‌హిళా సిబ్బంది ముఖంపై కొట్టిన‌ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


సూప‌ర్ మార్కెట్‌ లోకి ప్రవేశించిన వ్యక్తి ఈ వీడియోలో త‌న‌కు ఎదురుప‌డిన వారిపై పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డాడు దొరికిన వ‌స్తువుల‌ను విసిరివేయ‌డంతో షాపింగ్‌కు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్లు భయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. సిబ్బందిని, క‌స్ట‌మ‌ర్ల‌ను కార‌ణం లేకుండా కొడుతూ రెచ్చిపోయిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.