నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో చొరబడి తాళాలు పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. మక్లూర్ మండల కేంద్రం, మాదాపూర్ గ్రామాల్లో దొంగలు ఇండ్లు, దుకాణాలే లక్ష్యంగా దోపిడీకి తెగబడ్డారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంటికి వేసిన తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోని బంగారం, నగదు దోచుకెళ్లారు.
ఓ వైన్స్ లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. గతంలో ముల్లంగి అనే గ్రామంలో మొత్తం 11 ఇండ్లలో దొంగతనాలు చేశారు. తాజాగా మరోసారి దొంగతనాలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.