ప‌బ్‌జీనా మజాకా.. 10 రోజుల్లో 3.4 కోట్ల డౌన్‌లోడ్లు.. దుమ్ములేపుతున్న ఇండియన్ వెర్షన్

ప‌బ్‌జీ గేమ్ దుమ్ములేపింది. ఈ ఆటంటే ఎంత పిచ్చో మరోసారి స్పష్టమైంది. జూలై 2న ఇండియాలో విడుదలైన ప‌బ్‌జీ ఇండియా వ‌ర్ష‌న్‌ను కేవ‌లం 10 రోజుల్లోనే 3.4కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. విప‌రీత‌మైన క్రేజ్ తో ప్లే స్టోర్‌లో ఈ యాప్ దూసుకెళ్తోంది.

ప్రస్తుతం ఈ గేమ్ కు 1.6 కోట్ల మంది డైలీ యాక్టివ్ యూజర్స్ ఉన్నట్టు క్రాప్ట‌న్ సంస్థ చెప్పింది. పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్ గేమ్‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ ప‌ట్ల ఆ సంస్థ ఇండియా డివిజ‌న్ హెడ్ వూ యెల్ ధ‌న్య‌వాదాలు తెలియజేశాడు. ప్ర‌స్తుతానికి ఇది ఆండ్రాయిడ్ యూజ‌ర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

త్వరలోనే ఐవోఎస్ వ‌ర్ష‌న్ ను తీసుకొస్తామని క్రాప్ట‌న్ సంస్థ ప్ర‌క‌టించింది. భ‌ద్ర‌త కార‌ణాలతో ప‌బ్‌జీని కేంద్రం ప్ర‌భుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్స్ ఇండియా పేరుతో తాజాగా ఈ పబ్జీ గేమ్ ను ఇండియాలో రిలీజ్ చేశారు.