మరోసారి పుజారా విఫలం.. అజిత్‌ వాడేకర్‌ చెత్త రికార్డు సమం

chateshwara-pujara

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ పుజారా ఆకట్టుకోలేకపోయాడు.

కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.

chateshwara-pujara

టీమిండియా తరపున బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానంలో వచ్చే పుజారా.. 2019లో ఆసీస్‌ పర్యటనలో ఆఖరిసారి సెంచరీ (193 పరుగులు) చేశాడు. అప్పటినుంచి 39 ఇన్నింగ్స్ లుగా ఒక్క సెంచరీ చేయలేదు.

ఇంతకముందు టీమిండియా మాజీ ఆటగాడు అజిత్‌ వాడేకర్‌ టెస్టుల్లో మూడో స్థానంలో వచ్చి 39 ఇన్నింగ్స్ ల పాటు సెంచరీ సాధించలేకపోయాడు. తాజాగా ఆ చెత్త రికార్డును పుజారా సమం చేశాడు.

ఇక అభిమానులు కూడా పుజారా ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.  మొన్న ఇలాగే రహానే ట్రోల్‌ అయ్యాడు. ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టులో రహానే, పుజారాలిద్దరిని  తొలగించి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి అని పోస్టులు పెడుతున్నారు.