షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ కి పదేళ్ల జైలు శిక్ష ?

punishment for shahrukh son aryan khan in drugs case will be minimum 10 years ?
punishment for shahrukh son aryan khan in drugs case will be minimum 10 years ?
punishment for shahrukh son aryan khan in drugs case will be minimum 10 years ?
punishment for shahrukh son aryan khan in drugs case will be minimum 10 years ?

బాలీవుడ్ అంటే డ్రగ్స్ .. డ్రగ్స్ అంటే బాలీవుడ్. చిన్న పెద్ద.. ఆడ మొగ తేడాలేవి లేకుండా నిత్యం మత్తులో తూలటం బీ టౌన్ సెలబ్రెటీలకు అలవాటే. ముంబై పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న బాలీవుడ్ బడా బాబుల డ్రగ్స్ కల్చర్ ని నిలువరించలేకపోతుంది. ఇప్పటికే సల్మాన్, షారుఖ్, రణబీర్, సైఫ్, దీపికా, అలియా వంటి సూపర్ స్టార్స్ డ్రగ్స్ కేసుల్లో విచారణలకి హాజరవుతుంటే.. ఇప్పుడు వారి వారసులు కూడా మత్తు మందుల వివాదాల్లో చిక్కుకోవటం బాలీవుడ్ లో సంచలనమవుతుంది. హీరోలుగా ఎంట్రీలు ఇచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిన ఈ టీనేజర్స్ మత్తులో తూలుతుండటం బాలీవుడ్ దయనీయ పరిస్థితికి నిదర్శనం. తాజాగా ముంబై సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ లో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. అయితే ఈ కేసు విచారణలో ఆర్యన్ ఖాన్ పై సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.

ఆర్యన్ కి ఎప్పటి నుండో డ్రగ్స్ అలవాటుందని.. కొన్నిసార్లు డ్రగ్స్ ని అమ్మినట్టు కూడా తన వాట్సాప్ చాటింగ్ లో ఆధారాలు లభించాయని అంటున్నారు. దీంతో ఆర్యన్ ఖాన్ చుట్టూ వేగంగా ఉచ్చు బిగుస్తుంది. ఆర్యన్ ఖాన్ దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక ఆర్యన్‌పై నమోదైన కేసులను, సెక్షన్స్ ని బట్టి చూస్తే అతడికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. మాములుగా చిన్న మొత్తంలో డ్రగ్స్ లభ్యమైతే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, లేదంటే 10 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండింటినీ అమలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో దొరికితే పదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష జరిమానా విధిస్తారు. వాణిజ్య పరమైన విక్రయాలు చేస్తూ దొరికితే పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ పార్టీలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 ఎండీఎంఏ పిల్స్, 5 గ్రాముల ఎండీని దొరికినట్టుఎన్సీబీ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కొనడం, దగ్గర ఉంచుకోవడం, నిషేధిత ఉత్ప్రేకరాలను వాడటం వంటి కేసులు ఆర్యన్ పై నమోదు చేశారు. అయితే బాలీవుడ్ లో అపుడే ఆర్యన్ ఖాన్ ని మరో సంజయ్ దత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంజయ్ దత్ కూడా అతి చిన్న వయసులోనే డ్రగ్స్ కి బానిసైన విషయం తెలిసిందే.