పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ అదరగొట్టే డ్యాన్స్ స్టెప్స్.. సోషల్ మీడియాలో వైరల్ - TNews Telugu

పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ అదరగొట్టే డ్యాన్స్ స్టెప్స్.. సోషల్ మీడియాలో వైరల్పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఈనెల 19న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా కపుర్తాలాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఇలా స్టేజీ మీద ‘భాంగ్రా డ్యాన్స్‌’ స్టెప్స్ వేసి అదరగొట్టాడు.

సీఎం చన్నీ..తనదైన ఎనర్జీతో జానపద నృత్యకారులతో కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. సీఎం డ్యాన్స్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.