54 రన్స్ తేడాతో  బెంగళూరుపై పంజాబ్ విజయం

Punjab Kings

కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఓటమి పొందింది. పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ తమ బ్యాటింగ్ సత్తా చూపారు. పంజాబ్ 209 పరుగులు చేసింది. ఆ తర్వాత పంజాబ్  ఇచ్చిన టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. పంజాబ్ బౌలర్ల దాటికి తట్టుకోలేక పోయారు బెంగళూరు టీమ్ బ్యాట్ మెన్లు.ఒకరి తర్వాత ఒకరు వరుసగా వెంట వెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసి విజయానికి చాలా బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక్కడే కాసేపు పోరాడాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (20), కెప్టెన్ డుప్లెసిస్ (10) మరోమారు తీవ్రంగా నిరాశపరిచారు. రజత్ పటీదార్ 26 పరుగులు చేయగా, మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీసుకోగా, రిషి ధావన్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు టాస్ గెలిచిన డుప్లెసిస్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బెయిర్‌స్టో-ధావన్ జోడీ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాజపక్స (1) కూడా క్రీజులోకి నిలవలేకపోయాడు. అయితే, లివింగ్ స్టోన్ వచ్చాక మ్యాచ్ టర్న్ అయ్యింది. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. మొత్తంగా 20 ఓవర్లలో 9  వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను పంజాబ్ సజీవంగా ఉంచుకుంది. 12 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. పంజాబ్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన బెయిర్‌స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.