ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న రాచకొండ ఎస్వోటీ పోలీసులు

గుట్టు చప్పుడు కాకుండా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ లో బంటు రాజేష్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి బెట్టింగ్ ఆర్గనైజర్ గా వ్యవహరిస్తూ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి బంటు రాజేష్ అనే బెట్టింగ్ నిర్వాహకుడి దగ్గర నుంచి 30 లక్షల విలువ చేసే నగదు, డిజిటల్ యాప్ లలో ఉన్న నగదును స్వాధీనం చేసుకుని బెట్టింగ్ నిర్వాహకులను రిమాండుకు తరలించినట్టు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

Rachakonda Police Attacks On Ipl Cricket Betting
Rachakonda Police Attacks On Ipl Cricket Betting

యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ లో పాల్గొనాలంటే వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తర్వాతనే బెట్టింగ్ లో పాల్గొనడానికి అనుమతి ఇస్తారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 10.లక్షల 16 వేల నగదు, వివిధ బ్యాంక్ లలో ఉన్న రూ. 19 లక్షల 89,000 డబ్బులు 5 సెల్ ఫోనులు, 11 డెబిట్ కార్డులను సీజ్ చేసినట్టు కమిషనర్ తెలిపారు.