మా ఎన్నికలపై స్పందించిన దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు.. ఆయన చేసిన కామెంట్స్ ఇవే

raghavendra rao comments on maa elections
raghavendra rao comments on maa elections

మా ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మా రచ్చ కొనసాగుతూనే ఉంది. పట్టుమని 900 ఓట్లు కూడా లేని మా ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ జరిగిన సాధారణ ఎన్నికల సమరాన్ని తలపించాయి. ఈ ఎన్నికల్లో మెగా కాంపౌండ్ సపోర్ట్ తో నటించిన ప్రకాష్ రాజ్.. ఓటమి పాలు కాగా.. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్నట్టుగా కంటికి కనిపించని మా ఎన్నికల గురించి దర్శక దిగ్గజం కే.రాఘవేంద్రరావు సంచలన కామెంట్స్ చేశారు.

raghavendra rao comments on maa elections
raghavendra rao comments on maa elections

మా ఎన్నికలు జరిగిన తీరు.. ఓటింగ్, ప్రచారం, రభస వంటి తతంగాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు మా ఎన్నికలు ఇలా జరిగి ఉండకూడదు అన్నారు. మా ఎన్నికలు సృష్టించిన ప్రకంపనలు తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరిగేలా సినీ పెద్దలు చర్యలు తీసుకొని ఉంటే బాగుండేదని రాఘవేంద్రరావు అన్నారు.


మా ఎన్నికలు నిర్వహించకుండా అధ్యక్షుడడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుండేదన్నారు రాఘవేంద్రరావు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. అందులో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మా తమ్ముడు మోహన్ బాబు తనయుడికి ఆ సత్తా ఉందని ఆయన అన్నారు.