రాహులే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టాలి.. ప‌ట్టుబ‌ట్టిన కాంగ్రెస్ పాలిత సీఎంలు, సీనియ‌ర్ నేత‌లు

Twitter unlocks Rahul Gandhi's account

రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ప‌ట్టుబ‌ట్టారు. అయితే, నేతల అభిప్రాయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పార‌ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణు గోపాల్ చెప్పారు. ఇవాళ జ‌రిగిన సిడబ్ల్యుసి స‌మావేశ‌ నిర్ణయాలను ఆయ‌న తెలియ‌జేశారు.

2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సాగనున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేప‌ట్ట‌నున్నారు. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేయ‌నున్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 20 వ‌ర‌కు పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు విడుత‌ల వారీగా జ‌రుగ‌నున్నాయి.