రైల్‌ రోకో విజయవంతమైంది.. అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందే: రాకేశ్ తికాయిత్

BKU Leader Rakesh Tikayath

BKU Leader Rakesh Tikayath Comments

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రి పదవిని నుంచి తొలగించాలని, ఆయన్ను అరెస్ట్‌ చేయాలన్న డిమాండ్‌తో ఇవాల దేశ వ్యాప్తంగా నిర్వహించిన రైల్‌ రోకో విజయవంతమైందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్‌ తికాయిత్‌ చెప్పారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా.. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే అజయ్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. నిర్దోషిగా నిరూపణ అయితే మళ్లీ మంత్రిగా చేయవచ్చన్నారు. అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి అరెస్ట్‌ చేసేవరకు రైతుల ఆందోళనలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.