పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు

Raj Kundra Gets Bail In Pornography Case
Raj Kundra Gets Bail In Pornography Case

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ దొరికింది. ముంబై మెట్రోపాలిటన్ కోర్టు కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చిన యువతులను నమ్మించి పోర్న్ సినిమాల్లో నటించేలా ఒత్తిడి చేశాడన్న ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అప్పటి నుంచి కోర్టు ముందు హాజరు పరిచి కస్టడీకి తరలించారు.

Raj Kundra Gets Bail In Pornography Case
Raj Kundra Gets Bail In Pornography Case

ఈ కేసులో విచారణ ముగిసిన కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని రాజ్ కుంద్రా ముంబై మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. తనను తప్పుడు కేసులో ఇరికించారని, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా కేసులోకి లాగారని పోలీసులపై రాజ్ కుంద్రా ఆరోపణలు చేశారు. కాగా.. బెయిల్ కోసం కుంద్రా వేసిన పిటిషన్ పై ముంబై న్యాయస్థానం విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.