అవకాశమిస్తానని నమ్మించి రాజ్ కుంద్రా ఆ సినిమాలు తీసేవాడు.. ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా

Raj Kundra Porn Videos Issue
Raj Kundra Porn Videos Issue
Raj Kundra Porn Videos Issue
Raj Kundra Porn Videos Issue

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి యువతుల చేత బ్లూ ఫిల్ములు తీయించేవాడు. ఆ సినిమాల ద్వారా అక్రమ మార్గంలో రాజ్ కుంద్రా కోట్ల రూపాయలు సంపాదించాడు అని ముంబై పోలీసులు బుధవారం కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నారు. శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా అతడి సహచరుడు రేయాన్ థోర్పె మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Raj Kundra Porn Videos Issue
Raj Kundra Porn Videos Issue

అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను మాయమాటలు చెప్పి నీలి చిత్రాల్లో నటించేలా ప్రోత్సహించేవాడు. ఆ చిత్రాలను కొన్ని యాప్ ల ద్వారా మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించేవారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సింగపూర్ కి చెందిన యశ్ ఠాకూర్, లండన్ కు చెందిన ప్రదీప్ బక్షీలను కూడా నిందితులుగా చేర్చారు. వీరిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. రాజ్‌కుంద్రా, థోర్పే గత జులై నెల 19 నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం వీరు వేసిన పిటిషన్ ముంబై సెషన్స్ కోర్టులో పెండింగులో ఉంది.