ముంబై జైలు నుంచి బెయిలుపై విడుదలైన రాజ్ కుంద్రా

Raj Kundra walks out of Mumbai jail after bail in porn racket case

Raj Kundra walks out of Mumbai jail after bail in porn racket case

పోర్నోగ్ర‌ఫీ కేసులో అరెస్టు అయిన వ్యాపార‌వేత్త రాజ్‌కుంద్రా ఇవాళ ముంబైలోని ఆర్ధ‌ర్ రోడ్డు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. పోర్నోగ్ర‌ఫీ కేసులో నిన్న ముంబై కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఉద‌యం 11.30 నిమిషాల‌కు రాజ్‌కుంద్రా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. రెండు నెల‌ల క్రితం ఆయ‌న అరెస్టు అయ్యారు. 50వేల పూచీక‌త్తుపై మెజిస్ట్రేట్ భాజిపాలే ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేశారు. కుంద్రాతో పాటు అరెస్టు అయిన ర్యాన్ థోర్ప్‌కు కూడా బెయిల్ ఇచ్చారు. సెంట్ర‌ల్ ముంబైలో ఉన్న ఆర్డ‌ర్ రోడ్డు జైలులో రాజ్‌కుంద్రాను జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉంచారు. హాట్‌స్పాట్స్ అనే యాప్ ద్వారా అశ్లీల చిత్రాల‌ను అప్‌లోడ్ చేసిన‌ట్లు కుంద్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే తానేమీ పోర్న్ కాంటెంట్‌ను క్రియేట్ చేయ‌లేద‌ని కుంద్రా తెలిపారు. కుంద్రాకు బెయిల్ మంజూరైన కొద్ది గంటలకే శిల్పాశెట్టి ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా ”గ్రహణం వీడితే మళ్లీ మంచిరోజులు వస్తాయనడానికి సంకేతమే ఇంద్రధనుస్సు” అంటూ ఓ ట్వీట్ చేసింది.

ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అశ్లీల వీడియోల‌ను షూట్ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని అప్‌లోడ్ చేసిన‌ట్లు రాజ్‌కుంద్రాపై ఆరోప‌ణ‌లు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్‌, లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు చెప్పారు. ఆ వీడియోలన్నింటినీ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్‌ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్‌’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు.