రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న తలైవా

Rajani Kanth Received Dada Saheb Phalke Award From Vice President Venkayya Naidu

సినీ ఇండస్ట్రీకి 40 ఏండ్లుగా సేవలందించిన తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నారు. తన నటనతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ కి ఈ విశిష్ట గౌరవం దక్కడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఏడాదిలో రజినీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే కార్యక్రమంలో హీరో ధనుష్ అసురన్ మూవీకి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. రజినీకాంత్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. యంగ్ హీరోలు సైతం రజనీకాంత్ సినిమా రిలీజ్ ఉందంటే.. తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారంటే రజనీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Rajani Kanth Received Dada Saheb Phalke Award From Vice President Venkayya Naidu
Rajani Kanth Received Dada Saheb Phalke Award From Vice President Venkayya Naidu

అవార్డు అందుకోవడం కంటే ముందు రజినీకాంత్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు రావడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. తనను సినిమా తెరకు పరిచయం చేసిన కే.బాలచందర్ గారి సమక్షంలో ఈ అవార్డు అందుకుంటే ఇంకా సంతోషంగా ఉండేవాణ్ణి అన్నారు. ఈ అవార్డు రావడం సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాలే కారణమని తలైవా అన్నారు.