రెచ్చిపోయిన రాజస్థాన్ ఆటగాళ్లు.. పంజాబ్ లక్ష్యం 186 పరుగులు - TNews Telugu

రెచ్చిపోయిన రాజస్థాన్ ఆటగాళ్లు.. పంజాబ్ లక్ష్యం 186 పరుగులుఐపీఎల్ 2021 సెకండ్ సెషన్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఐదో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లు ఆడి 185 పరుగులు చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లు రాజస్థాన్ బ్యాట్స్ మెన్ల జోరుకు చేతులెత్తేశారు. బౌలర్లు దండిగా పరుగులిచ్చుకున్నారు. పంజాబ్ టీమ్ లక్ష్యం 186 పరుగులు.

Rajasthan Royals All Out For 185 Runs In 20 Overs
Rajasthan Royals All Out For 185 Runs In 20 Overs

రెచ్చిపోయి ఆడిన రాజస్థాన్ బ్యాట్స్ మెన్లలో జైస్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 49 పరుగుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మహిపాల్ 43 పరుగులు చేశాడు. 17 బాల్స్ ఆడి 4 సిక్సులు, 2 ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. లూయిస్ 36(7ఫోర్లు, 1 సిక్స్), లివింగ్‌స్టోన్ 25 (2 ఫోర్లు, 1 సిక్స్)పరుగులతో రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 5, షమీ 3, ఇషాన్ పొరెల్, హార్‌ప్రీత్ చెరో వికెట్ తీసుకున్నారు.