చివరి బంతి వరకు పోరాడిన పంజాబ్ కింగ్స్.. 2 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ - TNews Telugu

చివరి బంతి వరకు పోరాడిన పంజాబ్ కింగ్స్.. 2 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త బాల్స్ దగ్గర పడేకొద్ది ఉత్కంఠను పెంచింది. ఏకకాలంలో అటు బాల్స్, ఇటు రన్స్ కరుగుతూ క్రికెట్ ప్రేమికులను ఫుల్ టెన్షన్ పెట్టింది పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్ ను 185 పరుగులకు ఆలౌట్ చేసింది. ముందు బ్యాటింగ్ చేసిన జైస్వాల్, మహిపాల్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరి దూకుడుకు లూయిస్, లివింగ్ స్టన్ జత కలిసి స్కోర్ బోర్డును స్పీడుగా పరుగులు పెట్టించారు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు.  అయితే.. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ ఒక్కడే ఐదు వికెట్లు తీసుకొని ఆకట్టుకున్నాడు. షమీ 3 వికెట్లు, ఇషాన్ పోరెల్, హర్ ప్రీత్ చెరో వికెట్ పడగొట్టారు.

Rajasthan Royals Won By 2 Runs
Rajasthan Royals Won By 2 Runs

186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటు వీరులు రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చూస్తుండగానే స్కోరు కరిగిపోయింది. ఓ వైపు బంతులు.. మరోవైపు పరుగులు చూస్తుండగానే పోటీ పడి తగ్గిపోయాయి. పంజాబ్ కింగ్స్ ఈజీగా మ్యాచ్ గెలుస్తారు అనుకుంటున్న సమయంలో వికెట్లు పడ్డాయి. చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు తీయాల్సిన సమయంలో రెండు వికెట్లు పోవడం పంజాబ్ కు కోలుకోలేని దెబ్బ. చివరి బంతికి మూడు పరుగులు తీయాల్సిన సమయంలో కార్తీక్ త్యాగి వేసిన బంతికి పరుగులు రాకపోవడంతో రాజస్థాన్ రాయల్ష్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ టీం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌‌లో ఆల్‌ రౌండ్ ప్రదర్శన చేసినా చివరి ఓవర్‌లో ఫలితం మారిపోవడంతో పంజాబ్‌ టీంకు ఓటమి తప్పలేదు.

#IPL #IPL2021 #IPLUAE #RajasthanRoyals #Punjabkings