
ఐపీఎల్ 2021 సెకండ్ సెషన్ లో భాగంగా దుబాయ్ లో జరుగుతున్న సీజన్ లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. రాయస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్వల్ప స్కోరును కూడా ఛేదించలేక ఓటమి పాలైన హైదరాబాద్ కసి మీదుంది.

సన్ రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక మ్యాచులో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే 9 మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలిచింది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉండగా.. రాజస్థాన్ ఆరో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోతే సన్ రైజర్స్ ఇంటి బాట పట్టక తప్పదు. రాజస్థాన్ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశం లభిస్తుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ : ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తఫిజుర్ రహమాన్