
మా ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఒకర్నొకరు ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ.. శాపనర్దాలు పెట్టుకుంటున్నారు. మీడియా ముఖంగా కన్నీళ్లు కారుస్తున్నారు. సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ మాదిరి డ్రామాని తెగ పండించేస్తున్నారు. ఇదంతా చూస్తున్న జనాలకి మాత్రం కాస్త ఇబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ మా ఎలెక్షన్స్ లో ఆత్మగౌరవం నినాదంతో మంచు విష్ణు సెంటిమెంట్ రాజకీయాలకి తెరలేపుతే.. మేము పనిచేస్తాం మాకొక అవకాశమివ్వండి అంటున్నాడు ప్రకాష్ రాజ. మా ఎన్నికల్లో మొదట ప్రకాష్ రాజ్ దే పైచెయ్యి అనిపించినా.. తెలుగు ఆత్మగౌరవం నినాదంతో మంచు విష్ణు కూడా దూకుడుగా ముందుకెళ్తున్నాడు. ఇప్పుడిప్పుడే మంచు ప్యానల్ కి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. సినిమాల్లో బయటివాళ్లనే పెట్టుకుంటారు.. మా అసోసియేషన్ ఎన్నికల్లో కూడా వారినే గెలిపించాలా.. ఏ మన తెలుగువాళ్ళు దేనికి పనికిరారా అంటూ రవిబాబు ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చాడు.
ఇక లేటెస్ట్ గా రాజీవ్ కనకాల కూడా మంచు విష్ణు ప్యానెల్ కి సపోర్ట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేయకుండా తప్పుకున్నాను.. ఆ స్థానంలో రఘుబాబు పోటీ చేస్తున్నాడు.. ఆయన ఎక్కడా కూడా ప్రచారం చేసుకోవడం లేదు. అందుకే నేను ఆయనకు మద్దతుగా ఉంటాను.. నేను మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నాను. ముందు బయటకు రండి.. ఓటు వేయండి.. ఎవరో ఒకరికి ఓటు వేయండి. నేను తెలుగోడైన మంచు విష్ణు కి సపోర్ట్ చేస్తున్నాను. ఎవ్వరినైనా మన తెలుగోళ్లు ఆదరిస్తారు. ఇంటికి వస్తే చక్కగా డైనింగ్ టేబుల్ పై కూర్చోపెట్టి భోజనం పెడతారు. కానీ అదే ఇంట్లో ఉంటూ అజమాయిషీ చేస్తా అంటే ఊరుకోరు. మనింటికి బయటివాళ్ళు వచ్చి నీ ఇంటి సంగతి నేను చూస్తారా అంటే ఊరుకుంటామా. ఏ మేమేమైనా గాజులు తొడుక్కుని కుర్చున్నామా.. మన ఇంటి సమస్యల్ని పరిష్కరించటం మనకి చేతకాదా.. మనం చక్కదిద్దుకోలేమా? మనకు చేవలేదా? అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు రాజీవ్ కనకాల.