త్వరలో రకుల్ పెండ్లి.. అందుకే షూటింగులు వాయిదా వేస్తోందా! - TNews Telugu

త్వరలో రకుల్ పెండ్లి.. అందుకే షూటింగులు వాయిదా వేస్తోందా!అందం, అభినయంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న ఢిల్లీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ కి గత కొద్దికాలంగా తెలుగులో హిట్స్ లేవు. అయితే.. బాలీవుడ్ మాత్రం ఆఫర్లు బాగానే వస్తున్నాయి. దీంతో సినిమా హిట్ తో సంబంధం లేకుండా ఎడాపెడా అవకాశాలు చేజిక్కించుకుంటున్నది. అందానికి ప్రాముఖ్యత ఇచ్చే పాత్రలతో పాటు.. డిఫరెంట్ కథలు కూడా ఒప్పుకుంటూ.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. అయితే.. ఈ మధ్యే రకుల్ ప్రీత్ సింగ్ తన లవ్ గురించి క్లారిటీ ఇచ్చింది. తరచుగా మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ బగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. దీంతో రకుల్ లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో కుప్పలుకుప్పలుగా వార్తలు వైరల్ అయ్యాయి.


ప్రేమ గురించి చెప్పి.. పెండ్లి ముచ్చట దాస్తోంది
తోటి నటులు, నిర్మాతలతో కాస్త సన్నిహితంగా మెలిగినా సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతాయి. అదే.. అఫిషియల్ గా వారే తమ ప్రేమ, సాన్నిహిత్యం విషయాన్ని పబ్లిక్ గా చెప్పేస్తే ప్రచారమయ్యే వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ప్రేమలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చిన రకుల్.. పెండ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండా.. సీక్రెట్ మెయింటెన్ చేస్తోంది.


చేతి నిండా సినిమాలు.. తొందరగా పూర్తి చేయండంటూ రిక్వెస్టులు
ఈ మధ్య కాలంలోనే పెండ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. దీంతో.. వీలైనంత తొందరగా సినిమాలు పూర్తి చేయమని నిర్మాతలు, దర్శకులను రిక్వెస్ట్ చేస్తుందట. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోయినా.. బాలీవుడ్ సినిమాలు మాత్రం బాగానే ఉన్నాయి. కొండపొలం సినిమాతో ఈ మధ్యే తెలుగు ప్రేక్షకులను పలకరించినా.. త్వరలోనే మళ్లీ హిందీలో బిజీ కానుంది. అయితే.. వచ్చే నెలలో పెండ్లి ముహుర్తం పెట్టుకుందామనుకుంటున్న రకుల్ సినిమా పనులు తొందరగా పూర్తి చేయడమే కాకుండా.. పలు కాల్షీట్లు సైతం క్యాన్సిల్ చేసుకుందట. తొందరగా పూర్తయ్యే సినిమాలను ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని.. వచ్చే నెలలో షూటింగులు పెట్టుకోకుండా డేట్స్ అడ్జస్ట్ చేయండి అంటూ నిర్మాతలను కోరుతుందట. దీంతో పెండ్లి పనులు మొదలు పెట్టేందుకే రకుల్ సినిమాలు తొందరగా పూర్తి చేసేందుకు ట్రై చేస్తోందంటున్నారు పలువురు.


రకుల్ కి కాబోయే వాడైనా ఆ విషయం చెప్తాడా?
రకుల్ ప్రేమికుడు జాకీ భగ్నాని బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని కుమారుడు. 2018లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ మిత్రాన్ లో హీరోగా నటించాడు. అది తెలుగులో సూపర్ హిట్ అయిన పెళ్లిచూపులు మూవీకి రీమేక్. ఆ తర్వాత కూలీ నెంబర్ 1, జవానీ జానేమన్, బెల్ బాటమ్ సినిమాలు నిర్మించాడు. రకుల్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ బాలీవుడ్ బడా నిర్మాతైనా.. కనీసం తన పెండ్లి గురించి ఏమైనా లీకులు ఇస్తాడేమో చూడాలి.