బన్నీ, బాలయ్యలకి ధీటుగా.. రామ్ చరణ్ సిద్ద వచ్చేశాడు.. ఆచార్యపై అమాంతం పెరిగిన అంచనాలు..!

Ram Charan Siddha Teaser Out From Chiranjeevi Acharya Movie
Ram Charan Siddha Teaser Out From Chiranjeevi Acharya Movie

గడిచిన కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఎవరు పిలిస్తే వారి ఫంక్షన్స్ కి హాజరవుతూ ట్రెండింగ్ లో ఉన్న హీరో అల్లు అర్జున్. గెస్టుగా వెళ్లిన ఆ సినిమా ప్రమోషన్ కంటే తన పుష్ప కి పబ్లిసిటీ వచ్చేలా బన్నీ ప్లానింగ్ చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. కానీ బన్నీ అవేవి పట్టించుకోకుండా.. ప్రతి ఫంక్షన్లో తన గడ్డాన్ని గెలుకుతూ.. ఎక్కడ తగ్గేదెలే అంటున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని మ్యాచ్ చేయాలన్న కోరికో.. లేదంటే ఇంకేదైనా కారణమో కానీ బన్నీ మాత్రం పుష్ప బ్రాండ్ ని అమాంతం పెంచే పనిలో పడ్డాడు. తాజాగా బాలయ్య అఖండ మూవీ ఈవెంట్ కి వెళ్లి ‘జై బాలయ్య’ అని మరి షాక్ ఇచ్చాడు బన్నీ. అఖండ ఫంక్షన్ లోను తన గడ్డం గీకుతూ.. బాలయ్య ఎదురుగానే తగ్గేదెలా అంటూ పుష్ప ప్రమోషన్స్ చేసేశాడు బన్నీ. ఇక పుష్ప తో పాటు అఖండ మూవీ సాంగ్స్, టీజర్స్ కి కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. బాలయ్య ఎనర్జీ, స్టైల్, డైలాగ్స్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా అఖండ లోని అఘోర పాత్రపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో పుష్ప, అఖండ ట్రాన్స్ లో ఉన్న ఫ్యాన్స్ మెగాస్టార్ ఆచార్యని మరిచిపోయేలా చేసింది. ఎక్కడ ఆచార్య కొత్త అప్డేట్స్ లేకపోవటం కూడా దీనికి కారణం. అయితే ఎక్కడో పబ్లిసిటీలో వెనుకపడిపోతున్నామా అని అనుకున్నారో ఏమో.. తాజాగా ‘సిద్ధ’ రామ్ చరణ్ టీజర్ ని విడుదల చేసింది ఆచార్య టీమ్.

ఈరోజు ఉదయం ఈ సినిమా నుంచి రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేశారు ఆచార్య మేకర్స్. ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇక చరణ్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు చిత్రయూనిట్. ధర్మస్థలికి ఆపద వస్తే ఆ అమ్మోరుతల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక చివరిలో ఓ చెరువు దగ్గర చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే తల్లి చిరుత వెనుక ఉన్న విజువల్ చూపించారు.. అచ్చం అలాగే చరణ్ నీళ్లు తాగుతుంటే.. చరణ్ వెనుక చిరంజీవి ఉన్న సీన్ చూపించారు. ఈ లాస్ట్ షాట్ టీజర్ కె హైలైట్ అని చెప్పాలి. సిద్ద టీజర్ తో ఆచార్య పై అంచనాలు మరింత పెరిగి పోయాయి అంటున్నారు మెగా ఫ్యాన్స. ఇక ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.