రామ్ ‘ది వారియర్’ టీజర్ రిలీజ్.. పోలీస్ గెటప్‌లో అదుర్స్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రామ్ మొదటి సారి పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు ఆదిపినిశెట్టి కనిపించనున్నారు.

ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఆది విలనిజం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కృతి శెట్టి మరోసారి తన అందంతో కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నది.