పార్లమెంటులో అత్యాచారం.. సారీ చెప్పిన ప్రధాని

పౌరుల హక్కులను కాపాడేందుకు చట్టాలు చేయాల్సిన పార్లమెంటులోనే మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిపై తోటి ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తప్పతాగిన ఆ ఉద్యోగి ఆమెను సమావేశానికి రమ్మని పిలిచి రేప్‌ చేశాడు. 2019లో జరిగిన ఈ దారుణాన్ని ఆమె ఇటీవల ఓటీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.

లైంగిక దాడి జరిగినప్పుడు స్థానిక మీడియా, పోలీసులకు కంప్లెయింట్ చేశానని, ఎవ్వరూ తనని పట్టించుకోలేదని భవిష్యత్‌పై భయంతో సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చిందని ఆమె బాధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌, రక్షణ మంత్రి లిండా రెనాల్డ్స్‌ ఆమెకు క్షమాపణలు చెప్పారు. అమెకు తగిన న్యాయం చేస్తామన్నారు.