తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక ఎప్పుడు చోటుచేసుకొని అరుదైన సీన్ ఒకటి తాజాగా అవిష్కృతమైంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఇలా జరగటం ఇదే మొదటిసారి అంటున్నారు. కారణాలు ఏవైనా తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ లు ఇద్దరు ఒకేసారి తమ తమ రాజధానుల నుండి ఇతర ప్రాంతాల పర్యటనకి వెళ్ళటం రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అరుదైన సీన్ అన్న మాట వినిపిస్తోంది. బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా.. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండానే ద్యేయంగా.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి నిన్న కేసీఆర్ ఢిల్లీ పర్యటనకి వెళ్ళాడు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ.. దేశంలోని టాప్ పొలిటికల్ లీడర్స్, మేధావులు, సంఘ సేవకులని కలవనున్నారు కేసీఆర్. దీనికోసం నిన్న హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.
అయితే సీఎం కేసీఆర్ బయల్దేరే కొద్దీ గంటల ముందే ఏపీ సీఎం జగన్ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ కు బయలుదేరి వెళ్లారు. సీఎం జగన్ బయలుదేరి వెళ్లిన కొద్ది గంటల తేడాతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఇలా ఒకే రోజు.. కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాజధాని ప్రాంతాల నుంచి బయలుదేరి వెళ్లిన మొదటి సందర్భం ఇదేనని చెబుతున్నారు. నిజానికి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ.. ఏపీ ముఖ్యమంత్రి కానీ విదేశీ పర్యటనలు.. ఢిల్లీ టూర్లు చాలా తక్కువగానే చేస్తారని చెప్పాలి. అలాంటిది ఇద్దరు సీఎంలు ఒకేరోజు ఒకే సమయంలో ఇలా టూర్లకి వెళ్ళటం అరుదైన సీన్ గానే చెప్పుకోవాలి.