ర్యాష్ డ్రైవింగ్ కేసు. నేడు పోలీసులకు లొంగిపోనున్న సిద్దూ

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన పటియాలా పోలీసులకు లొంగిపోనున్నారు. పాటియాలా పోలీసులకు లొంగిపోయేందుకు ఇప్పటికే అమృత్ సర్ నుంచి ఆయన పాటియాలా చేరుకున్నారు. సిద్ధూపై 1988 నాటి ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితుడైన 65 ఏండ్ల వృద్ధుడిని సిద్ధూ ఉద్దేశపూర్వకంగానే గాయపరిచినట్టు 2018లో సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించి వదిలేసింది. అయితే జరిమానా మాత్రమే విధించడం సరికాదంటూ బాధితుడి కుటుంబసభ్యులు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.