వివిధ భావోద్వేగాల్లో రష్మిక పిక్స్.. నెట్టింట్లో వైరల్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్ రష్మిక.. తాజాగా ఓ పోస్టు చేసింది. వైరలవుతున్న ఈ ట్విట్ లో.. రష్మిక డిఫరెంట్ భావాలను పలికించే పిక్ లను పోస్టు చేసింది. ఇది చూసిన రష్మిక అభిమానులు ఫుల్ జోష్ తో నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.

స్మైల్, చిరు కోపం, సిగ్గు, ప్రశాంతం, ఆశ్చర్చం, చిలిపితనం…ఇలాంటి భావోద్వేగాలు నిండిన పొటోలను రష్మిక తన అభిమానులతో పంచుకుంది. వీటిల్లో మీరు ఏ మూడ్‌ని ఎంచుకుంటారు? అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. దీనికి నెటిజన్లు బాగా స్పందించారు. రష్మిక సో స్వీట్‌ అని ఒకరు…సో క్యూట్‌ అని ఇంకొకరు…సో హాట్‌ అని కొందరు….వావ్‌ అదిరిపోయావు అంటూ కొందరు నెటిజన్లు స్పందించారు.

ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’, హీరో శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో నటిస్తోంది. ఇక హిందీలో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా ‘మిషన్‌ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ చిత్రంలో నటిస్తూ సందడి చేస్తోంది.