క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ.. షారుక్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ ఫోన్ సీజ్ చేసి ప్రశ్నిస్తున్న ఎన్సీబీ

The NCB busted a high-profile rave party onboard a cruise ship off the coast of Mumbai on Saturday evening.

ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్ లో నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మెరుపు దాడి చేసి పెద్దమొత్తంలో ఎక్స్ ట‌సీ, కొకైన్‌, మెఫిడ్రోన్‌, చ‌ర‌స్‌లాంటి డ్ర‌గ్స్ ను స్వాధీనం చేసుకున్నది. దాంతోపాటు 8 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. వీరిలో బాలీవుడ్‌, ఫ్యాష‌న్‌, బిజినెస్ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ‌ల‌ పిల్లలు ఉన్నట్లు సమాచారం.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ల కూతుళ్లు ఈ రేవ్ పార్టీలో ఉన్న‌ట్లు ఎన్సీబీ గుర్తించింది. ఇప్పటికే ఆర్యన్ ఫోన్ ని సీజ్ చేసిన ఎన్సీబీ.. రేవ్ పార్టీ గురించి ఆర్యన్ ను ప్రశ్నిస్తోందని ఎన్సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖెడె చెప్పారు.

క్రూయిజ్ పార్టీ ప్లాన్ చేసిన ఆరుగురు ఆర్గ‌నైజ‌ర్లు, ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కాషిఫ్ ఖాన్ కు ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసి ప్రశ్నిస్తోంది. త‌మ క్రూజ్‌లో ప్ర‌యాణిస్తున్న వాళ్ల ద‌గ్గ‌ర నుంచి నార్కోటిక్స్ అధికారులు డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు ఈ క్రూజ్ ప్రెసిడెంట్‌, సీఈవో జుర్గెన్ బైలోమ్ ధృవీకరించాడు.