
ఐపీఎల్ 2021లో తొలి ఎలిమినేటర్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. లీగ్ మ్యాచులు దాటి.. ఎలిమినేటర్ దశ వరకు వచ్చిన రాయల్ ఛాలెంజర్స్, కలకత్తా నైట్ రైడర్స్ ఈరోజు తలపడనున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ర 2 మ్యాచ్ ఆడుతుంది. ఓడిన టీమ్.. నేరుగా తట్టా బుట్టా సర్దుకొని ఇంటి బాట పట్టాల్సిందే. కాగా.. విరాట్ కొహ్లీకి టీ20 ఫార్మాట్ లో కెప్టెన్ గా ఇదే చివరి మ్యాచ్. కెప్టెన్ గా ఈ సిరీస్ గెలిచి కప్పు సాధిస్తాడా? లేదా అనేది ఈ రోజు సాయంత్రం తేలనుంది.
ఐపీఎల్ 2021 14వ సీజన్ లో షార్జా ఆసక్తికర మ్యాచ్ కి ఆతిథ్యమివ్వబోతోంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్‌కి చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఈరోజు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు బుధవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడతారు. ఐపీఎల్ లో కోల్‌కతా, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 13 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది. ఇక చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్ుల్లో మూడింట్లో బెంగళూరు గెలిచింది.
ప్లేఆఫ్స్ అనుభవాన్ని బట్టి చూస్తే.. బెంగళూరు కంటే కోల్‌కతా ముందజలో ఉంది. ఇప్పటికే కోల్‌కతా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవగా.. బెంగళూరు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కెప్టెన్‌గా చివరి ఐపీఎల్ సీజన్ ప్రకటించిన కోహ్లీ ఈ సారి గట్టి పోటీ ఇచ్చి.. కప్ గెలవాలన్న కసితో ఉన్నాడు. టీమ్ ల వారీగా బలాబలాల్ని పరిశీలించినా.. కోల్‌కతా కంటే బెంగళూరు టీమ్ పటిష్టంగా ఉంది.