బిగ్‌ సర్‌ప్రైజ్‌ కు సిద్ధంగా ఉన్నారా? యూవీ ట్వీట్ వైరల్

Yuvraj-Singh

టీమిండియా క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు. తన ట్వీట్టర్ అకౌంట్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్ కు సమయం ఆసన్నమైందంటూ వీడియోలో చెప్పుకొచ్చిన యూవీ… టీజర్‌కు క్యాప్షన్‌గా ‘‘మీరంతా రెడీగా ఉన్నారా?  మీ అందరికీ బిగ్‌ సర్‌ప్రైజ్‌. స్టే ట్యూన్డ్’’ అంటూ పోస్టు చేశాడు.

రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్, అబుదాబి టీ10, ఐపీఎల్‌ వంటి లీగ్‌ల్లో మెరిశాడు. గతేడాది నుంచి ఐపీఎల్‌ కు దూరమయ్యాడు.

ఈ క్రమంలో ‘వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అభిమానుల కోసం మళ్లీ క్రికెట్‌ పిచ్‌ మీదకు రావాలని ఆశిస్తున్నా..’ అంటూ కొన్ని రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా యువీ అభిమానులు సహా క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే.