అప్పట్లో ఒక వెలుగు వెలిగాడు.. కానీ హీరోయిన్ల పిచ్చితో.. కెరీర్ నాశనం చేసుకున్న హీరో ఆకాష్ ..!

Reasons Behind Anandam Movie Hero Jai Akash failures In Career
Reasons Behind Anandam Movie Hero Jai Akash failures In Career
Reasons Behind Anandam Movie Hero Jai Akash failures In Career
Reasons Behind Anandam Movie Hero Jai Akash failures In Career

‘ఆనందం’ మూవీతో టాలీవుడ్ తెరపై హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆ మూవీ అప్పట్లో సిల్వర్ జూబ్లీ ఆడటంతో హీరోగా ఆకాష్ పేరు ఇండస్ట్రీలో ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. డిఫరెంట్ యాటిట్యూడ్, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో అప్పట్లో అమ్మాయిల రాకుమారుడిగా ఒక వెలుగు వెలిగాడు ఆకాష్. అయితే లవర్ బాయ్ ఇమేజ్ నుండి స్టార్ హీరో స్థాయికి వెళ్తాడనుకున్న హీరో ఆకాష్ కెరీర్ ఒక్కసారిగా స్పాయిల్ అయిపోయింది. మినిమమ్ 20ఇయర్స్ మూవీ ఫీల్డ్ లో నిలదొక్కుకుండానుకుంటే మధ్యలోనే కనుమరుగైపోయాడు. అయితే దీనికి ప్రధానంగా ఒక కారణం ఉందంటూ సోషల్ మీడియాలో లేటెస్ట్ గా ఒక చర్చ సాగుతుంది. ఆనందం మూవీ ఇచ్చిన కిక్ తో, తనకు వచ్చిన స్టార్‌ స్టేటస్‌ను చూసుకుని దర్శక-నిర్మాతలను తన డిమాండ్‌లతో ఇబ్బంది పెట్టడమే ఆకాష్ కెరీర్ పాడవ్వడానికి ముఖ్య కారణమని  సినీ వర్గాల అభిప్రాయం.

ఆకాష్ అసలు పేరు సతీష్‌ నాగేశ్వరన్‌. 1981 మార్చి 18న కొలంబోలో శ్రీలంక తమిళ కుటుంబంలో జన్మించిన ఆకాష్ లండన్ లో స్టడీస్ కంప్లీట్ చేసి.. సినిమాలపై ఆసక్తితో చెన్నై వచ్చి ‘రోజా వనం’ అనే తమిళ సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తరువాత సుమంత్ ‘రామ్మా చిలకమ్మ’మూవీలో సైడ్‌ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు ఆకాష్ కి అనుకున్నంత పేరు తీసుకురాలేదు. కానీ ఆ వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం మూవీ ఆకాష్ కెరీర్ గ్రాఫ్ ని ఒక్కసారిగా హైకి తీసుకెళ్లింది. కానీ ఆకాష్ హీరోగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు.

ఆనందం మూవీ ఇచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ తో ప్రాక్టికాలిటీని మిస్ అయిపోయాడట ఆకాష్. ఆనందం తరువాత వచ్చిన సినిమా నిర్మాతలతో భారీ డిమాండ్ల చిట్టా పెట్టేవాడట. ఆకాష్ కి స్టార్ హీరోయిన్లతో పనిచేయాలన్న పిచ్చి ఉండేదట. అందుకే తన సినిమాల్లో ముఖ్యంగా అప్పటి స్టార్ హీరోయిన్లు సోనాలి బింద్రే, సిమ్రాన్‌ లను పెట్టాలని డిమాండ్స్ చేసేవాడట. వారేమో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించే స్థాయి కావటంతో వారి డేట్స్ దొరికేవి కాదట. దాంతో ఆ సదురు నిర్మాతలతో హీరో ఆకాష్ సినిమాలను క్యాన్సిల్ చేసుకునేవాడని సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

అయితే స్టార్ హీరోయిన్ల పిచ్చితో ఆకాష్ మంచి కథా బలమున్న సినిమా ఆఫర్లను వదులుకోగా.. ఆ చిత్రాలను ఇతర హీరోలు చేసి సూపర్ హిట్స్ కొట్టేవారట. కథలను నమ్ముకోకుండా హీరోయిన్స్ కోసం ప్రాకులాడటమే ఆకాష్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి మెయిన్ రీజన్ అని తెలుస్తుంది. దీంతో కొంతకాలం నటనకు దూరమై తెరపై కనుమరుగైన ఆకాశ్‌ ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్‌ తీసిన ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ తనదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరపైకి వచ్చాడు. తన సినిమాను పూరి దొంగలించారని, నష్టపరిహరంగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. కానీ దీనిపై పూరి ఇంతవరకు స్పందించలేదు.

అయితే ఆకాష్ నిర్మాతగానూ ఎన్నో సినిమాలను చేసి ఆర్థికంగా నష్టపోవటంతోనే డబ్బు, ఫేం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లు, పూరి అభిమానులు ఆకాశ్‌ను విమర్శించారు. అయితే హీరో ఆకాష్ ఈ విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. నేను డబ్బుకోసం ఇలాంటి పనులు చేయనని.. నాకు లండన్ లో 3పెట్రోల్ బంకులు. సూపర్ మార్కెట్స్ ఉన్నాయని.. నన్నుతెలుగు చిత్ర పరిశ్రమ దగా చేసిందంటూ ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు.