కృష్ణంరాజుకి లేఖతో.. చిరంజీవికి చెడ్డపేరు.. మీకు అవసరమా ?

Reasons Behind Chiranjeevi Letter To Krishnam raju
Reasons Behind Chiranjeevi Letter To Krishnam raju
Reasons Behind Chiranjeevi Letter To Krishnam raju
Reasons Behind Chiranjeevi Letter To Krishnam raju

దాసరి మరణం తరువాత ఇండస్ట్రీకి పేద దిక్కుగా వెలుగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లో అవసరమున్న వారికి తన సహాయ సహకారాలు అందిస్తు ఇండస్ట్రీ బాస్ గా పేరుతెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా జరుగుతన్న మా ఎన్నికల రచ్చ అందరికి తెలిసిందే. సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఈ ఎన్నికల ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తుంది.  మా సభ్యులందరు మీడియాకెక్కి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని మా ప్రతిష్టని బ్రష్టుపట్టిస్తున్నారని నలువైపులా నుండి విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మా సీన్ లోకి సడర్న్ ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిదిగా మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్  కృష్ణం రాజుకి లేఖ రాయటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటివరకు ‘మా’ పిక్చర్ లో తెర వెనుక మాత్రమే ఉండి పావులు కదిపే అలవాటున్నట్లు చెప్పే చిరంజీవి.. తన తీరుకు భిన్నంగా సీన్లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వటం ఆయన రేంజుకి కరెక్టేనా.. అనవసరంగా ఈ ‘మా’ రొచ్చులో చిరు తలదూర్చటం ఆయన స్థాయికి సరైంది కాదని విమర్శలు వస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు ఫిలిం క్రిటిక్స్.

ఇక ఎవరెన్ని చెప్పిన మా ఎన్నికల్లో తెరవెనుక చక్రం తిప్పేది మెగాస్టార్ చిరంజీవే అని అందరికి తెలిసిందే. ఎవరు అధ్యక్షుడు కావాలన్నా మెగా స్టార్ ఆశీస్సులు ఉండాల్సిందే. నరేష్ అధ్యక్షుడు అవ్వడానికి కూడా చిరంజీవి తెరవెనుక సహకరించారని అంటుంటారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన చిరంజీవి వెనుకాలే నరేష్ ఉండటం.. ఓటువేసిన తరువాత బాగా పనిచేయండి అంటూ పెద్దాయన స్టైల్లో నరేష్ తో అనటం జరిగాయి. అలాంటిది ఈ రోజు అందుకు భిన్నంగా లేఖ రాసేసి నేరుగా ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు పలువురిని విస్మయానికి గురిచేస్తుంది.

అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏకంగా ఐదుగురు సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉండడంతో విమర్శల పర్వం ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఈ డోస్ మరింత పెరిగింది. లేటెస్ట్ గా నరేష్ ని బహిరంగంగా విమర్శిస్తూ హేమ ఆడియో టేప్ లీక్ అవ్వటం.. హెమ కి మా అధ్యక్షుడు నరేష్, జీవిత రాజశేఖర్ లు కౌంటర్లు ఇవ్వటంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఈ గొడవలను ఇక్కడే పులిస్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ నేరుగా లేఖ రాస్తూ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటాడని అంటున్నారు. అయతే ఈ చిన్న విషయానికి చిరంజీవి లేఖ రాయాల్సిన అవసరం లేదని. ఎప్పటిలానే తెరవెనుకలా ఉంటూ, కృష్ణం రాజుకి ఒక్క ఫోన్ కాల్ చేసి, ఎన్నికలు నిర్వహించాలని చెప్తే సరిపోయేదని ఇండస్ట్రీ వర్గాలు లోలోపల అనుకుంటున్న మాట.

ఇప్పటికే ఇండస్ట్రీ నాలుగు వర్గాలుగా చీలి పోవటం.. ఒకరి మాట ఒకరు వినకపోవడంతో.. చిరంజీవి రాసిన లేఖని నరేష్ ప్యానల్ అండ్ మెగాస్టార్ అపోజిట్ వర్గం వ్యతిరేకంగా మాట్లాడవచ్చని.. అనవసరంగా వారికి చిరంజీవి ఛాన్స్ ఇవ్వాల్సింది కాదని కొందరి వాదన. ఇక ఏదేమైనా ఎన్నికల రచ్చకు ఫుల్ స్టాప్ వేసేందుకే రాసిన చిరు లేఖ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మెగాస్టార్ లేఖ ప్రకారం ఎన్నికలకు నరేష్ వర్గం ఒప్పుకుంటుందా.. లేదా మరింత రచ్చ చేస్తారా అన్నది వేచి చూడాలి. అయితే సినిమాటిక్ మలుపులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న            మా ఎన్నికల వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని సిత్రాల్ని చూపిస్తుందో చూడాలి.