దేశంలోనే నెం.1 సీరియల్.. చరిత్ర సృష్టించిన కార్తీకదీపం..!

Record-breaking ‘Karthika Deepam’: Number One in India
Record-breaking ‘Karthika Deepam’: Number One in India

టాలీవుడ్ రికార్డుల్ని లెక్కకట్టాలంటే బాహుబలి నాన్ బాహుబలి అని ఎలా లెక్కలు కడుతున్నారో.. కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్‌లో కార్తీకదీపం.. నాన్ కార్తీకదీపం అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ఏం ట్విస్టూ.. ఇప్పటికే ఈ సీరియల్ చూస్తూ బోరు బోరున ఏడుస్తూ టీవీలకు అతుక్కుని పోతున్న వాళ్లికి ఇంకాస్త ఫెవికాల్ వేసి ఫిట్ చేసినట్టుగా మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్ పెట్టి ‘కార్తీకదీపం’ సీరియల్‌ని ఉత్కంఠ కలిగించేలా చేశారు. దీంతో ఈ సీరియల్ రేటింగ్‌లో దుమ్ముదులుపుతోంది. తెలుగులో అయితే చెప్పాల్సిన పనిలేదు. అసలు ఏ ఛానల్‌కి ఏ సీరియల్‌కి కంటి చూపులో కూడా కనిపించనంత రేంజ్‌లో టాప్ రేటింగ్ సాధిస్తోంది. ఈ సీరియల్‌ని బీట్ చేయడం కాదు కదా.. కనీసం పోటీ ఇవ్వడానికి కనుచూపు మేరలో కూడా మరే ఇతర సీరియల్ లేదు. ఇప్పటికే బుల్లితెర చరిత్రలో కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించిన కార్తీకదీపం మరో రికార్డ్‌కి చేరువైంది.

ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్ సాధించిన సీరియల్‌గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ నెంబర్ స్థానం కార్తీకదీపం సీరియల్‌కి ఇదే తొలిసారి కాదు.. ఇప్పటికే నెంబర్ 1 స్థానంలో ఉండగా.. తాజాగా ఈవారం 21. 01 టీఆర్పీ సాధించి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంది. అంతకు ముందు 20.07 ఉన్న టాప్ టీఆర్పీ రేటింగ్ బ్రేక్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని నిరుపమ్ పరిటాల ఫ్యాన్స్ పేజ్‌లో అభిమానులు షేర్ చేయగా.. దీన్ని ప్రేమి విశ్వనాథ్ తన ఫేస్ బుక్ స్టోరీగా పెట్టుకుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక ఈ సీరియల్ విషయానికి వస్తే అభిమానుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఏందయ్యా ఇది.. ఇన్నాళ్లు ఇలా సాగదీస్తావ్ ఇప్పటికే మూడున్నరేళ్లు నడిపేశావ్.. 1058 ఎపిసోడ్‌లు అయిపోయినయ్.. ఇంకో వెయ్యి ఎపిసోడ్‌లు తీస్తావా? ఏంటి.. ఆ దీప-డాక్టర్ బాబుల్ని కలిపేయవయ్యా డైరెక్టరూ.. మేం నాలుగు అక్షింతలు వేసి.. ఇంట్లో పప్పూ బువ్వ వండుకుని తినేస్తాం అని జనం గగ్గోలు పెడుతున్న సందర్భంలో.. సీరియల్‌ని ఆసక్తికరంగా మార్చేశారు.