రికార్డు వ్యాక్సినేషన్.. 100 కోట్ల దిశగా టీకాల పంపిణీ - TNews Telugu

రికార్డు వ్యాక్సినేషన్.. 100 కోట్ల దిశగా టీకాల పంపిణీకరోనా వ్యాక్సినేషన్ లో భారత్‌ మరో మైలు రాయిని చేరుకుంది. అత్యంత వేగంగా టీకాల పంపిణీలో 95 కోట్ల మార్కును దాటి.. 100 కోట్ల దిశగా సాగుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశాడు.

‘‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసుల పంపిణీలో ఇండియా 95 కోట్ల మార్కును దాటి.. 100 కోట్ల దిశగా సాగుతోంది. మీరు త్వరగా వ్యాక్సిన్‌ తీసుకొని ఇతరులనూ ప్రోత్సహించండి.’’ అని మాండవీయ ట్వీట్లో చెప్పాడు.

ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ మొదలైన విషయం తెలిసిందే. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు, మార్చి 1 నుంచి 60 ఏండ్ల పైవారికి, మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు.