ఇలా వాకింగ్ చేస్తే 3 నెలల్లో 30 కిలోల బరువు తగ్గొచ్చు

వేళాపాళలేని తిండి, ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం, ఇతర సమస్యలతో పలు రకాల జబ్బుల బారినపడుతున్నారు. ఈ జబ్బులలో ఒబేసిటీ తీవ్రస్థాయిలో ఉంది. ప్రస్తుత కాలంలో 100లో 90 మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే అధిక బరువును కచ్చితంగా తగ్గించుకోమని వైద్యులు చెబుతున్నారు. దాంతో చాలా మంది తమ బరువు తగ్గించుకోవడం కోసం జిమ్ ట్రైనర్లకు వేలకు వేలు ఖర్చుపెడుతున్నారు. కానీ, తిండి విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావడంలేదు. జిహ్వ రుచిని కాస్త తగ్గించుకుంటే చాలా సింపుల్‌గా మనంతట మనమే ఈజీగా బరువు తగ్గొచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా రోజూ వాకింగ్ చేయడమే. అయితే ఈ వాకింగ్ ఇష్టంవచ్చినట్లు కాకుండా.. రోజూ గంట సేపు కచ్చితంగా చేయాలి. ఒక్కరోజు కూడా వాకింగ్ మిస్ చేయకుండా, మిగతా వ్యాయామాలు చేయకున్నా కూడా వాకింగ్ ద్వారానే బరువు తగ్గించుకోవచ్చు.

ప్రతి రోజూ గంట పాటూ వాకింగ్ చేస్తే వారంలోనే 3 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇలా 12 వారాల పాటు చేస్తే 30 కిలోలు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువలో తక్కువగా వేసుకున్నా కూడా సుమారు 20 కిలోలు తగ్గొచ్చంటున్నారు. పైగా వాకింగ్ ద్వారా బరువు తగ్గడం చాలా మంచి పద్ధతని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాసెస్‎లో ఆహారాన్ని తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. డైటీషియన్ సలహ మేరకు డైట్ ప్లాన్ ఫాలో కావాలంటున్నారు.

కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ జోలికి వెళ్లకూడదు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చేసుకోవాలి. పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. అయితే మాంసాహారాన్ని మాత్రం కచ్చితంగా తగ్గించాలి.

వాకింగ్ చేసేటప్పుడు చేతులు ఊపుతూ వేగంగా నడవాలి. మెల్లగా నడవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వాకింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి వేగంగా నడవకూడదు. మెల్లగా మొదలుపెట్టి క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి. వ్యాయామం మొదలుపెట్టిన రోజే గంట నడవడం కష్టం. కాబట్టి రెండు మూడు రోజులు అరగంట పాటూ నడిచి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళితే మంచిది.