ఢిల్లీలో కరోనా ఆంక్షలు సడలింపు

corona-restrictions

దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలను సడలించారు. రోజువారి పాజిటివ్ కేసులు, టెస్టుల పాజిటివీటి రేటు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

అలాగే ఇవాళ డీడీఎంఏ భేటీలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 50% సామర్థ్యంతో సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు అనుమతించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దుకాణాల విషయంలో సరి-బేసి విధానానికి స్వస్తి పలికారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు 200 మంది వరకు అనుమతిచ్చారు. పాఠశాలలు తెరిచే అంశంపై తదుపరి డీడీఎంఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.